ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటికి నిప్పటించిన మతిస్థిమితం లేని వ్యక్తి! - పెనుకొండలో అగ్నిప్రమాదం

అనంతపురం జిల్లా పెనుకొండ మెయిన్ బజార్లో ఓ ఇంటికి మతిస్థిమితం లేని వ్యక్తి నిప్పటించాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

The insane person who set the house on fire  at penukonda
ఇంటికి నిప్పటించిన మతిస్థిమితం లేని వ్యక్తి

By

Published : Nov 22, 2020, 1:47 PM IST


అనంతపురం జిల్లా పెనుకొండ మెయిన్ బజార్లోని రాజేష్ అనే వ్యక్తికి చెందిన ఇంటికి.. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి నిప్పటించాడు. ఇంటిలో పాత చెక్క వస్తువులు, గుజరీ వస్తువులు ఉన్న కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. విషయం తెలుసుకున్న పెనుకొండ అగ్నిమాపకశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

ABOUT THE AUTHOR

...view details