వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే జర్నలిస్టులపై దాడులు పెరిగాయని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఓ న్యూస్ ఛానల్ విలేఖరి మనోహర్‌పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిని ఖండిస్తూ కాల్వ శ్రీనివాసులు అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విలేఖరిని పరామర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు భద్రత కరువైందన్నారు. కక్ష సాధింపు చర్యలతో ప్రజలు, జర్నలిస్టులపైన దాడులు చేస్తున్నారని విమర్శించారు.
"జర్నలిస్టుపై దాడి అత్యంత హేయమైన చర్య" - journalist
రాయదుర్గంలో ఓ జర్నలిస్టుపై జరిగిన దాడిని మాజీ మంత్రి, తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు ఖండించారు. అధికారి పార్టీకి చెందిన నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
జర్నిలిస్టు
రాయదుర్గం ఘటనపై ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఏం సమాధానం చెబుతారని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఘటనపై జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు చర్యలు తీసుకోకపోవటంపై కాల్వ శ్రీనివాసులు అసహనం వ్యక్తం చేశారు.