తుంగభద్ర బోర్డు మండలి తొలి సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహించారు. ఈ ఏడాది కూడా తుంగభద్ర జలాలతో ఉప్పొంగనుందని బోర్డు అంచనా వేస్తోంది. ఆయకట్టుకు, సాగునీటికి ఇబ్బంది లేదని తెలిపారు. ఈ సారి తుంగభద్ర జలాశయానికి 199 టీఎంసీలు వచ్చే అవకాశం ఉందని.. 170.8 టీఎంసీలు వినియోగంలోకి రానున్నది. ఏపీకి 52.698, కర్ణాటక రాష్ట్రానికి 110.143, తెలంగాణ రాష్ట్రానికి 5.159 టీఎంసీలు నీటి కేటాయింపులు జరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఏపీ కోటాలో హెచ్ఎల్‌సీకి ( తుంగభద్ర ఎగువ కాలువ కు) 25.755 టీఎంసీలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వర్చువల్‌గా తుంగభద్ర బోర్డు తొలి సమావేశం - Tungabhadra Board meeting
వర్చువల్‌గా తుంగభద్ర బోర్డు మండలి తొలి సమావేశం జరిగింది. ప్రోరేట్ ప్రకారం రాష్ట్రాల వాటాను అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో ఏపీకి 52.698 టీఎంసీలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Breaking News