కరోనా వైరస్ బాధితులకు సేవలందించటానికి ప్రైవేట్ వైద్యులు సహకారం అందించాలని మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ విజ్ఞప్తి చేశారు. అనంతపురం కలెక్టరేట్లో ప్రైవేట్ వైద్యులతో సమావేశం నిర్వహించిన ఆయన... ఐఎంఏలో సభ్యులుగా ఉన్న ప్రైవేట్ వైద్యులు ప్రభుత్వానికి సహాయపడలని కోరారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్యులు క్వారంటైన్ కేంద్రాల్లో, కోవిడ్ బాధితులకు సేవలందిస్తున్నా... ఆ సంఖ్య సరిపోవటం లేదన్నారు. ప్రస్తుతం నర్సింగ్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నందున... ప్రైవేట్ నర్సింగ్ హోంల నుంచి నర్స్‌లను వైరస్ బాధితుల సేవలకు పంపాలని కోరారు.
'కరోనాపై పోరుకు ప్రైవేటు వైద్యుల సహకారం అవసరం' - కరోనాపై మంత్రి శంకరనారాయణ వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రైవేట్ వైద్యులు సహకారం అందించాలని మంత్రి శంకరనారాయణ విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్యులు క్వారంటైన్ కేంద్రాల్లో, కోవిడ్ బాధితులకు సేవలందిస్తున్నా...ఆ సంఖ్య సరిపోవటంలేదన్నారు.

కరోనాపై పోరుకు ప్రైవేటు వైద్యుల సహకారం అవసరం