ధర్మవరంలో నీటిట్యాంకు ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని గాంధీనగర్లో రెడ్డప్ప అనే రైతు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. తన భూమి వివాదంలో చిక్కుకుందని సమస్య పరిష్కరించాలని.. లేకుంటే పై నుంచి దూకేస్తానని బెదిరించాడు. ధర్మవరం మండలం మాలగుండ్లపల్లి గ్రామానికి చెందిన రెడ్డప్పకు అదే గ్రామానికి చెందిన రాజశేఖర్, నాగరాజులకు భూ వివాదం ఉంది. ఇరువురు కేసులు పెట్టుకోగా...ధర్మవరం కోర్టులో ఈ కేసు విచారణలో ఉంది. కేసు రాజీ కావాలని ప్రత్యర్థులు తనను బెదిరించారని, తనకు అధికారులు న్యాయం చేయాలని బాధితుడు డిమాండ్ చేశాడు. స్థానిక యువకులు గమనించి రైతును కిందకు దించి పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి: