ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంఈఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈఓ - నాడు నేడు పథకం

అనంతపురం జిల్లా మడకశిర మండల పరిధిలోని ఎంఈఓ కార్యాలయాన్ని జిల్లా విద్యాధికారి శామ్యూల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. "నాడు నేడు" పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఎంఈఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈఓ
ఎంఈఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈఓ

By

Published : Oct 8, 2020, 6:29 AM IST

అనంతపురం జిల్లా మడకశిర మండల పరిధిలోని ఎంఈఓ కార్యాలయాన్ని డీఈఓ శామ్యూల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించి "నాడు నేడు" పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు.

సిద్ధంగా ఉన్నాయి..

జగనన్న విద్యా దీవెన కింద జిల్లా వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థినీ, విద్యార్థులకు పంపిణీ చేసేందుకు 3 లక్షల 90 వేల కిట్లు సిద్ధంగా ఉన్నాయని డీఈఓ శమ్యూల్ తెలిపారు.

80శాతం చర్యలు..

జిల్లా వ్యాప్తంగా నాడు నేడు పాఠశాలలో 80% పనులు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. మిగిలిన 20 శాతం పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని శామ్యూల్ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : 'అమరావతి'పై వాదనలు.. రిట్ పిటిషన్ల విభజనకు హై కోర్టు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details