విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - cattleman death anathapur district
అనంతపురం జిల్లా శంకరగల్లు గ్రామంలో మంజునాథ్ అనే మేకల కాపరి విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
అనంతపురం జిల్లా గుడిబండ మండలం శంకరగల్లు గ్రామంలో మంజునాథ్ అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మంజునాథ్ గ్రామ పొలిమేరలో మేకలను కాసేవాడు. రోజువారీ కార్యక్రమంలో భాగంగా మేకలకు ఆకులు కోస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టులో దాగి ఉన్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో మంజునాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు.