ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మహిళపై దాడికి పాల్పడిన కానిస్టేబుల్​ను సస్పెండ్ చేయాలి' - కానిస్టేబుల్​ను సస్పెండ్ చేయాలి!

కదిరిలో దీపావళి సందర్భంగా ఓ ఇంటి వద్ద చోటుచేసుకున్న వివాదంలో మహిళపై... కానిస్టేబుల్ చేయి చేసుకున్నాడు. గాయపరిచాడు. ఇందుకు నిరసనగా బాధితురాలి తరఫున రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టారు.

మహిళపై దాడికి పాల్పడిన కానిస్టేబుల్​ను సస్పెండ్ చేయాలి

By

Published : Oct 30, 2019, 10:18 AM IST

మహిళపై దాడికి పాల్పడిన కానిస్టేబుల్​ను సస్పెండ్ చేయాలి

మహిళపై దాడి చేసిన కానిస్టేబుల్​పై చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం జిల్లా కదిరిలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. దీపావళి సందర్భంగా ఇంటి వద్ద చోటు చేసుకున్న వివాదంతో కానిస్టేబుల్.. మహిళపై దాడి చేసి గాయపరిచారంటూ ఆందోళనకారులు వాపోయారు. దాడి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. సరిగా స్పందించలేదని మండిపడ్డారు. కానిస్టేబుల్​పై ఫిర్యాదు చేస్తే, బాధితురాలి కొడుకుపై కేసు నమోదు చేశారని ... కానిస్టేబుల్ పై మాత్రం ఎలాంటి చర్యలు తెలుసుకోలేదని ఆరోపించారు. అతడిని సస్పెండ్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details