రిత్విక శ్రీ ఈ నెల 17న పర్వతారోహణకు బయలుదేరింది. 20న దక్షిణాఫ్రికా చేరుకుని గైడ్‌తో కలిసి ప్రయాణం ప్రారంభించింది. 7రోజుల పాటు సాగిన ఈ ప్రయాణం ఈ నెల 27న ముగిసిందని రిత్వికశ్రీ తండ్రి కడపల శంకర్ తెలిపారు. ఆసియా ఖండం నుంచి చిన్నవయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా రిత్వికశ్రీ రికార్డులకెక్కగా, ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా పలువురు బాలికను ఫోన్‌లో అభినందించారు.
కిలిమంజారోపై మన జాతీయ జెండా.. ఎగరేసింది మన చిన్నారే..! - ananthapuram district newsupdates
ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతంపై మన దేశ జాతీయ జెండా మరోసారి రెపరెపలాడింది. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల రిత్వికశ్రీ.. 5,685 మీటర్ల ఎత్తున్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది.
కిలిమంజారోను అధిరోహించిన చిన్నారి
Last Updated : Feb 28, 2021, 8:04 PM IST