అనంతపురం జిల్లా కదిరి వైశాఖ మాసం పౌర్ణమని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి మల్లెపూల ఉత్సవం వేడుకగా నిర్వహించారు . స్వామివారికి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నిర్వహించే ఈ వేడుకను ఉత్సవమును మద్దిలేరు వాగు వద్ద వున్న మల్లెపుల మండపంలో నిర్వహించేవారు.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి మల్లెపూల ఉత్సవం - వైశాఖ మాసం పౌర్ణమి
అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి మల్లెపూల ఉత్సవం వేడుకగా జరిగింది. వైశాఖ మాసం పౌర్ణమని పురస్కరించుకొని మద్దిలేరు వాగు వద్ద వున్న మల్లెపుల మండపంలో పూజ భక్తిశ్రద్ధలతో జరిపించారు.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి మల్లెపూల ఉత్సవం
ఈ సంవత్సరం లాక్ డౌన్ కారణంగా ఉత్సవాన్ని ఆలయంలోనే అర్చకులు , సిబ్బంది మధ్య భక్తిశ్రద్ధలతో జరిపించారు. అంతకుముందు శ్రీదేవి భూదేవి సమేత నరసింహుడిని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామివారికి వివిధ రకాల పూజలు నిర్వహించిన అర్చకులు అలంకారం భూషితుడైన నరసింహుడు ప్రత్యేక పీఠంపై అధిష్టింప చేశారు. శ్రీవారికి ఉయ్యాలోత్సవ సేవను నిర్వహించారు.
ఇది చదవండిగొడుగు ఉంటేనే మద్యం.. పాటిస్తున్నారు భౌతిక దూరం..!