ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంతకల్లులో వ్యక్తి దారుణ హత్య - The brutal murder of a man

ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఈ ఘటన చోటుచేసుకుంది.

వ్యక్తి దారుణ హత్య

By

Published : Aug 18, 2019, 4:54 PM IST

వ్యక్తి దారుణ హత్య

అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని బెంచికొట్టాలలో నివాసముండే శంకర్​ శుద్ధ జల వ్యాపారిగా జీవనం సాగిస్తున్నారు. మృతుడికి గతరాత్రి సుధాకర్ అనే వ్యక్తితో ఓ హోటల్ వద్ద ఘర్షణ జరిగింది. గొడవను మనసులో పెట్టుకున్న సుధాకర్ ఉదయాన్నే దుకాణం తెరవడానికి వెళ్లిన శంకర్​ను కత్తితో విచక్షణారహింతగా పొడిచాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న శంకర్​ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. మృతుడు తెదేపా నేత కావటంతో మాజీ శాసన సభ్యుడు జితేంద్రగౌడ్​తోపాటు కార్యకర్తలు ఆసుపత్రికి వచ్చి మృతుడు బంధువులను పరామర్శించారు. ఘటనపై మండిపడ్డ ప్రజాసంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకొని నిరసన విరమింపజేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

ABOUT THE AUTHOR

...view details