MINOR ARREST: బస్టాండ్‌లో సెల్ఫోన్లు చోరీ.. మైనర్ బాలుడి అరెస్ట్ - boy was arrested at Gutti bus stand
![MINOR ARREST: బస్టాండ్‌లో సెల్ఫోన్లు చోరీ.. మైనర్ బాలుడి అరెస్ట్ MINOR ARREST](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12949557-1000-12949557-1630594280768.jpg)
16:39 September 02
MINOR THIEF ARRESTED BY POLICE
అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌లో సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను గుత్తి పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రెక్కీ నిర్వహించి వీరిని పట్టుకున్నట్లు ఎస్సైలు సుధాకర్ యాదవ్, మురహరి తెలిపారు.
బస్టాండ్‌లో ఓ మైనర్ బాలుడు సెల్‌ఫోన్ చోరీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారించగా విస్తుబోయే వాస్తవాలు బయటపడ్డాయి. మైనర్ బాలుడు తెలిపిన వివరాల మేరకు ఉరవకొండకు చెందిన ఆకుతోట రామకృష్ణ అనే వ్యక్తి వద్ద చిల్లరకొట్టులో దొంగతనం చేసిన సెల్ఫోన్లు దాచినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ కేసులో బాలుడితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 6 లక్షలు విలువైన 111 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండీ..C.1.2 virus: కొత్త వేరియంట్‌తో ప్రమాదమా- శాస్త్రవేత్తల మాటేంటి?