ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటి మడుగులో పడి బాలుడు మృతి - boy died in anantapur district news

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్లాపురం తండాలో ఓ బాలుడు పొలంలోని నీటి గుంతలో పడి మృతి చెందాడు. ఇంట్లో సందడి చేస్తూ తిరిగే బిడ్డ మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమన్నీరవుతున్నారు.

The boy died
నీటి మడుగులో పడి బాలుడు మృతి

By

Published : Dec 29, 2020, 10:01 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్లాపురం తండాలో రితిక్ నాయక్(2) అనే బాలుడు మృతి చెందాడు. ప్రమాదవశాత్తు పొలంలోని నీటి మడుగులో పడి మృతి చెందాడు.

తండాకు చెందిన శీనా నాయక్, అనిత బాయి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవించే కుటుంబం వారిది. గ్రామానికి చెందిన ఓ రైతు.. వ్యవసాయ తోటను వారు కౌలుకు తీసుకున్నారు. తోటలో పనులు చేస్తుండగా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు.

రితిక్ నాయక్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి మడుగులో పడి మునిగిపోయాడు. బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇదీ చదవండి:

ఆంజనేయ స్వామి రథోత్సవంలో అపశ్రుతి... విద్యుదాఘాతంతో ఒకరి మృతి

ABOUT THE AUTHOR

...view details