ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దళిత రక్షణ ర్యాలీ.. సబ్​ కలెక్టర్ కార్యాలయ ముట్టడి - అనంతపురం జిల్లా తాజా వార్తలు

అనంతపురం జిల్లా పెనుకొండలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

sub-collector's office sieged
దళిత సంఘాలు సబ్ కలెక్టర్ కార్యాలయ ముట్టడి
author img

By

Published : Oct 5, 2020, 7:20 PM IST

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో అనంతపురం సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. పెనుగొండ ప్రధాన వీధుల్లో దళిత రక్షణ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా జిల్లా ఉప పాలనాధికారి కార్యాలయానికి వెళ్లారు. అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఒకరు మాత్రమే సమస్యలు వివరించాలని సబ్ కలెక్టర్ సూచించారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి లింగన్న పెనుగొండ సబ్ డివిజన్ పరిధిలో దళితులపై జరిగిన దాడులకు సంబంధించిన సమస్యలపై వినతి పత్రం అందజేశారు. దాడులపై విచారణ జరిపించి బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరారు.

ABOUT THE AUTHOR

author-img

...view details