ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫలించిన నిరీక్షణ.....గోదాము నుంచి పంట ఇళ్లకు తరలింపు - గుంతకల్లులో శెనగపప్పు గోదాము

అనంతపురం జిల్లా గుంతకల్లులో గోదాములో నిల్వచేసుకున్న శెనగపప్పును బ్యాంకు అధికారుల సమక్షంలో ఇళ్లల్లకు తీసుకెళ్లారు. గోదాములోని పప్పుకోసం..రైతులు గత వారం రోజులనుంచి ఆందోళన చేస్తున్నారు.

Th bengal gram stored in the warehouse at Guntakallu in Anantapur district were taken home in the presence of bank officials.
గుంతకల్లులో శెనగపప్పు గోదాము

By

Published : Aug 7, 2020, 9:06 AM IST

అనంతపురం జిల్లా గుంతకల్లులో గోదాములో నిల్వచేసుకున్న శెనగపప్పును బ్యాంకు అధికారుల సమక్షంలో రైతులు ఇళ్లకు తీసుకెళ్లారు. గోదాములోని పప్పుకోసం.. రైతులు గత వారం రోజులనుంచి ఆందోళన చేస్తున్నారు. పట్టణ శివార్లలోని 63వ నెంబర్ జాతీయ రహదారి పవన్ గోదాములో రైతులు పండించిన శెనగపప్పును నిల్వ ఉంచారు. గోదాములో నిల్వఉన్న శెనగను తీసుకెళ్లడానికి రైతులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. గత 20 రోజులుగా గోదాము చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. యాజమాన్యం వారు ఎవరూ స్పందించడం లేదు. గోదాము యాజమాన్యం ఎన్​సీఎంఎల్ సంస్థ నుంచి ..రుణం తీసుకున్నారు. డబ్బు చెల్లించకపోవడంతో ఆ సంస్థ .. గోదాముకు తాళం వేసింది. దీంతో రైతులకు సంబంధించిన నిల్వ మొత్తం గోదాములలో ఉండిపోయింది. తాము పండించిన పంటను తమకు ఇవ్వాలంటూ వారం రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా ఎవరు పట్టించుకోలేదు. దీనిపై స్పందించిన వైకాపా నాయకులు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. రుణం ఇచ్చిన సంస్థతో పాటు తహసీల్దార్ సమక్షంలో గోదాము తాళాలు తెరిపించారు. దీంతో రైతులు శెనగను తీసుకెళ్లిపోయారు.

ABOUT THE AUTHOR

...view details