ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆకతాయి పెట్టిన నిప్పు... 25 గొర్రెపిల్లలు సజీవదహనం - చిగురుమాను తండాలో గొర్రెపిల్లలు సజీవదహనం

ఓ ఆకతాయి అడవికి పెట్టిన నిప్పువల్ల ఆ ప్రాంతానికి సమీపంలోనున్న 25 గొర్రె పిల్లలు అగ్నికి ఆహుతయ్యాయి. అనంతపురం జిల్లా కదిరి మండలం చిగురుమాను తండా సమీపంలో ఈ దారుణం జరగగా.. ఈ ప్రమాదంలో ఓ ద్విచక్రవాహనం కూడా కాలిపోయింది. గొర్రెలన్నీ సజీవదహనమవ్వడంతో..గొర్రెల కాపరి కన్నీరుమున్నీరవుతున్నాడు.

tenty five lambs burnt alive at chigurumanu thanda
25 గొర్రెపిల్లలు సజీవదహనం

By

Published : Feb 11, 2021, 11:36 AM IST

అనంతపురం జిల్లా కదిరి మండలం చిగురుమాను తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ ఆకతాయి అడవికి నిప్పు పెట్టాడు. ఆ మంటల్లో ద్విచక్ర వాహనంతో పాటు 25 గొర్రె పిల్లలు సజీవ దహనమయ్యాయి.

నల్లగుట్ట తండాకు చెందిన గొర్రెల కాపరులు రమణ నాయక్, లక్ష్మీ నాయక్ చిగురుమానుతండా సమీప అడవిలో గొర్రెల మందని ఏర్పాటుచేసుకుని అక్కడే ఉంటున్నారు. కాపరులు పగటిపూట గొర్రెలను మేతకోసం అడవికి తోలుకెళ్లారు. ఆ సమయంలో 25 గొర్రెపిల్లలను మందలోనే వదలి వెళ్లారు. తండా సమీపంలో ఓ దుండగుడు పెట్టిన నిప్పువల్ల..అందులోని గొర్రెపిల్లలన్నీ సజీవదహనమయ్యాయి.

25 గొర్రెపిల్లలు సజీవదహనం

విషయం తెలుసుకున్న గొర్రెల కాపరుల కుటుంబీకులు బూడిదిగా మారిన గొర్రె పిల్లలు చూసి కన్నీరుమున్నీరయ్యారు. తమ ఆరు నెలల కష్టం అగ్ని ప్రమాదం రూపంలో దహనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని తాహసీల్దార్​కు వినతి పత్రం ఇచ్చారు.

ఇదీ చూడండి.ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్.. హత్యాయత్నం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details