Tenth class student: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వై.రాంపురం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ఎతిశ.. పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. దీంతో.. సప్లిమెంటరీ పరీక్షలు రాసింది. ఈసారీ గణితంలో విఫలమైంది. దీంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఎతిశ.. తమ్ముడు హరితో కలిసి హంద్రీనీవా కాలువ వద్దకు వెళ్లింది. కాళ్లకు ఉన్న పట్టీలు, చెవి కమ్ములు సోదరుడికి ఇచ్చి.. కాలువలోకి దూకింది. తాను ఆపేందుకు ఎంతగా ప్రయత్నించినా వినలేదని తమ్ముడు రోధిస్తూ తెలిపారు. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు కాలువ వెంబడి గాలించినా.. ఆచూకీ లభించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
టెన్త్ ఫెయిల్ అయ్యానని.. కాలువలో దూకిన విద్యార్థిని! - అనంతపురం జిల్లాలో కాలువలో దూకి విద్యార్థిని గల్లంతు
Tenth class student: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో.. ఓ విద్యార్థిని కాలువలో దూకింది. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో చోటు చేసుకుంది.
కాలువలో దూకిన విద్యార్థిని