ఇళ్లపట్టాల కోసం అనంతపురం జిల్లా సోమందేపల్లిలో అధికారులు చేపట్టిన భూసేకరణ కార్యక్రమం రైతుల ఆందోళనతో గందరగోళంగా మారింది. సోమందేపల్లి మండల కేంద్రంలోని మణికంఠ కాలనీకి చెందిన 14 మంది రైతులు గత కొన్ని సంవత్సరాలుగా కాలనీ సమీపంలోని 13 ఎకరాల 16 సెంట్ల భూమిని సాగు చేసుకుంటున్నారు. భూమి హక్కుకు సంబంధించి రైతుల వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం సదరు భూమిని సేకరించాలని భావించింది. రైతులు అందుకు ఒప్పుకోకపోగా... ఉదయం భూసేకరణ కోసం వచ్చిన స్పెషల్ డిప్యూటీ కలెక్టరును సీపీఐ నాయకుల మద్దతుతో అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
భూసేకరణలో ఉద్రిక్తత... అన్నదాతల అరెస్టు - అనంతపురం భూసేకరణ కార్యక్రమంలో ఉద్రిక్తత
అనంతపురం జిల్లా సోమందేపల్లిలో ఇళ్ల పట్టాలకోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ఉద్రిక్తతలకు దారి తీసింది. రైతులు భూసేకరణను అడ్డుకోవడం వల్ల పోలీసులు వారిని అరెస్టు చేశారు.
![భూసేకరణలో ఉద్రిక్తత... అన్నదాతల అరెస్టు భూసేకరణ కార్యక్రమంలో ఉద్రిక్తత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6060878-807-6060878-1581596570689.jpg)
భూసేకరణ కార్యక్రమంలో ఉద్రిక్తత