అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం సమీపంలోని కూరగాయల మార్కెట్‌ను తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పోలీస్ బలగాలను భారీగా రంగంలోకి దించారు. మరోవైపు.. మార్కెట్‌ను తొలగిస్తే తాము ఆత్మహత్యలు చేసుకుంటామని పెట్రోల్ బాటిళ్లుతో వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఓ వైపు అధికారులు.. మరొవైపు పెట్రోల్ బాటిళ్లతో వ్యాుపారులు. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
మూడు రోజుల క్రితం.. దుకాణాలు ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మేము దుకాణాలు ఖాళీ చేసేదే లేదంటూ దుకాణాదారులు భీష్మమించి కూర్చున్నారు.