అనంతపురం జిల్లా ధర్మవరం శాంతినగర్లో మున్సిపల్ అధికారులు ఇళ్ల తొలగించటానికి రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అనుమతులు లేకుండా 60 అడుగుల రహదారిలో గృహాలను నిర్మించారని వాటిని తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ సంఘటనా స్థలానికి వచ్చి తెలిపారు. ఈ దశలో ఆగ్రహించిన స్థానికులు ఇళ్ల తొలగింపును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. భాజపా సీపీఐ(ఎం) జనసేన నాయకులు అక్కడికి చేరుకున్నారు. భారీగా పోలీసులు మోహరించి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు నిర్మాణాలు తొలగించకుండా మహిళలు బైఠాయించారు. వారిని అక్కడ నుంచి బలవంతంగా లాక్కెళ్తుండగా పోలీసులపై తిరగబడ్డారు. స్థానికులు రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
ధర్మవరం శాంతినగర్లో ఉద్రిక్తత.... - ధర్మవరం శాంతినగర్లో ఉద్రిక్తత....
అనంతపురం జిల్లా శాంతినగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇళ్లను తొలగించటానికి వచ్చిన మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా స్థానిక మహిళలు ఆందోళనలు చేశారు. పరిస్థితిని అదుపుచేసేందుకు వచ్చిన పోలీసులపై మహిళలు తిరగబడ్డారు.
![ధర్మవరం శాంతినగర్లో ఉద్రిక్తత....](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4605854-671-4605854-1569865965033.jpg)
ధర్మవరం శాంతినగర్లో ఉద్రిక్తత....