ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tension: రాకెట్లలో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు - రాకెట్ల గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు

Tension: ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వినాయక నిమజ్జన సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కొందరికి గాయాలయ్యాయి. ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.

raketla
ఘర్షణ

By

Published : Sep 5, 2022, 4:10 PM IST

Tension: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్లలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఓ వర్గం వారు నిమజ్జనం చేసేందుకు వెళ్తున్న సమయంలో మరో వర్గం వాళ్లపై దుర్భాషలాడటంతో ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో కొందరికి గాయాలయ్యాయి. ఇరు వర్గాలవారు గ్రామంలో భారీగా మోహరించడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘర్షణను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తమ వర్గాన్ని దుషించారని వారిని వదిలేది లేదంటూ హెచ్చరించారు. తప్పు చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటస్వామి... గ్రామస్థులకు సర్దిచెప్పగా ఓ వర్గం వారు శాంతించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి ప్రత్యేక బలగాలు, పోలీసులు 60 మంది వరకు గ్రామంలో మోహరించారు. గుంతకల్ డీఎస్పీ నరసింగప్ప, సీఐలు, ఎసైలు గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అయితే ఓ వర్గం వారు జిల్లా కలెక్టర్​ను కలవడానికి వెళ్లగా పోలీసులు కూడేరు వద్ద అడ్డుకున్నారు. ఇరువర్గాల ఇళ్ల వద్ద పోలీసులు కాపలాగా ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details