అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అగలి మండలం హుల్లికెర గ్రామంలోని తెదేపా యువ కార్యకర్త ఈరేష్ నాయక్ ఐదు రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులను ఫోన్లో నందమూరి చైతన్య కృష్ణ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
అతని స్వగ్రామానికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు.. మృతుడి ఇంటికి వెళ్లి వీరేష్ నాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎలాంటి కష్టం వచ్చినా మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.