ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో పది గొర్రెలు మృతి - అనంతపురం జిల్లా తాజా వార్తలు

విద్యుదాఘాతంతో పది గొర్రెలు మృతి చెందాయి. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలోని యలగలవంక గ్రామంలో ఈ ఘటన జరిగింది.

shock circuit
విద్యుదాఘాతం

By

Published : May 25, 2021, 10:43 AM IST

అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలోని యలగలవంక గ్రామంలో మల్లేష్, రామ్మూర్తి అనే వ్యక్తులకు చెందిన పది గొర్రెలు విద్యుదాఘాతంతో మృతి చెందాయి. పొలంలో మేత కోసం వెళ్లిన సమయంలో వర్షం రావడంతో విద్యుత్ నియంత్రిక దిమ్మె వద్దకు వెళ్లాయి. అక్కడ తీగలకు విద్యుత్ సరఫరా కావడంతో గొర్రెలు మృతి చెందాయి. సుమారు 1.20 లక్షలు నష్టపోయినట్లు రైతులు ఆవేదన చెందారు. తమకు ఉన్న జీవనాధారం కోల్పోయామని ఇప్పుడు బతకాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన స్థలాన్ని విద్యుత్ అధికారులు పరిశీలించి తీగలను తొలగించారు.

ABOUT THE AUTHOR

...view details