పది గడ్డివాములు దగ్ధం.. రూ.4 లక్షల ఆస్తి నష్టం - అనంతపురంలో పది గడ్డివాముల దగ్ధం
అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ఎర్రంపల్లిలో పది గడ్డివాములను దగ్ధమయ్యాయి. రూ.4 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పది గడ్డివాములు దగ్ధం... రూ.4 లక్షల ఆస్తి నష్టం...
అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలోని ఎర్రంపల్లిలో పది గడ్డివాములకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో తమ పశువులకు వేసవికాలంలో మేత లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రూ.4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు రైతులు వాపోయారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.