విడపనకల్ మండలం గాజుల మల్లాపురం గ్రామంలో రామాంజనేయులు అనే కౌలు రైతుకు చెందిన 10 ఎకరాల పప్పు శెనగ వాము దగ్ధమైంది. పంటకు దుండగులు నిప్పు పెట్టారని అన్నదాత వాపోయాడు. ఈ ఘటనలో ఆరు లక్షల రూపాయల వరకు నష్టం వాట్లిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలు కష్టపడి పండించిన పంట కాలి బుడిదవటంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు.
పది ఎకరాల పప్పు శెనగ దగ్ధం.. రూ.ఆరు లక్షల నష్టం - అనంతపురం జిల్లా తాజా వార్తలు
అనంతపురం జిల్లా విడపనకల్ మండలం గాజుల మల్లాపురం 10 ఎకరాల పప్పు శెనగ వాము దగ్ధమైంది. ఈ ఘటనలో ఆరు లక్షల రూపాయల వరకు నష్టం వాట్లిల్లిందని అన్నదాత ఆవేదన చెందాడు.
పది ఎకరాల పప్పు శెనగ దగ్ధం.. ఆరు లక్షల నష్టం