ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్తిక పౌర్ణమితో కిక్కిరిసిన ఆలయం - karthika pournami celebrations 2020

అనంతపురం జిల్లా కదిరిలో కార్తిక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తిక పౌర్ణమి సోమవారం రావటంతో... ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి.

karthika pournami celebrations
కార్తీక పౌర్ణమితో కిక్కిరిసిన ఆలయం

By

Published : Nov 30, 2020, 3:25 PM IST

కార్తిక పౌర్ణమి సందర్భంగా అనంతపురం జిల్లా కదిరి ఉమామహేశ్వర ఆలయంలో భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి దీపారాధాన చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్తిక పౌర్ణమి సోమవారం రావటంతో...ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. భక్తుల సంఖ్య పెరగటంతో మహాత్మగాంధీ రోడ్​లో వాహన రాకపోకలను నిలిపివేశారు. పోలీసులు భక్తులను వరుసలో వెళ్లేలా సూచిస్తూ...బందోబస్తూ నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి:

తక్కువ ముళ్లు... ఎక్కువ రుచి... ఉప్పు నీటిలో పెరిగే అప్పలు చేప

ABOUT THE AUTHOR

...view details