ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Weather Update: నిప్పుల వర్షం కురిపిస్తున్న భానుడు.. జాగ్రత్తలు పాటిస్తున్న ప్రజలు - Highest temperature in Andhra Pradesh in summer

Temperatures Are Rising : ఎండలు బాబోయ్.. ఎండలు.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో పగటి వేళల్లో రహాదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వడ గాల్పులు వీస్తున్నాయి.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 20, 2023, 5:20 PM IST

Temperatures Are Rising : ఎండలు బాబోయ్.. ఎండలు.. రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇంటి నుంచి కాలు తీసి బయటపెట్టాలంటే వణుకు వస్తోంది. ఏప్రిల్‌లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవటంతో ఎండ తీవ్రతపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వచ్చే రోజుల్లో ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తలపై దృష్టి పెడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడ గాల్పులు వీస్తున్నాయి.

బయటకు రాని ప్రజలు.. నిర్మానుష్యంగా రహాదారులు : ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పగటి వేళల్లో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. భానుడి సెగల తాకిడికి జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావడం లేదు. దీంతో పగటి పూట రహాదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలు :రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరుకోవటంతో రాష్ట్రం సెగలు కక్కుతోంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వడ గాల్పులు వీస్తున్నాయి. ప్రకాశం జిల్లా తర్లిపాడు వద్ద అత్యధికంగా 44.56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 44.52 డిగ్రీలు, ప్రకాశం 44.34, శ్రీకాకుళం పలాస 43.99, పార్వతీపురం మన్యం- 43.85 డిగ్రీలు, తిరుపతి 43.73, చిత్తూరు 43.55, సత్యసాయి జిల్లా 43.51, అనకాపల్లి 43.47, నంద్యాల 43.44, కడప 43.31, కర్నూలు 43.13, తిరుపతి 43.08, నెల్లూరు 43, ఏలూరు 42.4, అల్లూరి జిల్లా 41.71, అన్నమయ్య 41.44, ఎన్టీఆర్ జిల్లా 41.31, తూర్పుగోదావరి 40.81, అనంతపురం 40.65, పలనాడు 40.61, విశాఖ 40.60, కాకినాడ - 40.59 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జాగ్రత్తలు అవసరం : రాష్ట్రంలో అత్యధికంగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలను చూసి జనాలు భయాందోళన చెందుతున్నారు. పగటి వేళ ఎండలో తిరగకుండా ఉండాలని వైద్యులు, నిపుణులు సలహాలు ఇస్తున్నారు. తప్పని సరి అయితే మాత్రం తప్ప పగటి పూట బయటకు వెళ్లకుండా.. ఇంట్లోనే ఉండాలని వైద్యులు, నిపుణలు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు, మజ్జిగ తరచు తీసుకోవాలని సూచినలు ఇస్తున్నారు. వేడి గాలులతో వడ దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఎండలో బయటకు వెళ్లినప్పుడు గొడుగు వెంట తీసుకు వెళ్లాలని, తెల్లటి వస్త్రాలు, టోపీ ధరించి వెళ్లాలని సూచనలు ఇస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండలు ఇప్పటి కంటే మరింత తీవ్రం కానున్నాయని, వృద్ధుల, చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details