అనంతపురంలోని డీఆర్డీఏ కార్యాలయం వద్ద తెలుగు యవత నాయకులు నిరసన చేపట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం... హామీలను నెరవేర్చాలన్నారు. లేనిపక్షంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
'మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్ల మొత్తాన్ని పెంచండి' - తెలుగు యవత ఆధ్వర్యంలో అనంతపురంలో నిరసన
"తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి వైకాపా ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది" అని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి ఆరోపించారు.

తెలుగు యవత ఆధ్వర్యంలో అనంతపురంలో నిరసన