అనంతపురంలోని రాప్తాడు సమీపంలో జాకీ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి కేటాయించిన స్థలంలో తెలుగు యువత అధ్యక్షులు నారాయణస్వామి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లాలో జాకీ పరిశ్రమ ద్వారా 6 వేల మంది ఉపాధి పొందే అవకాశం ఉందని చెప్పారు. వైకాపా ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాల కోసం పరిశ్రమను ఇక్కడినుంచి తరలిపోయేలా చేసిందని ఆరోపించారు. జాకీ పరిశ్రమ ఏర్పాటుకు వైకాపా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
రాప్తాడులో తెలుగు యువత సభ్యుల నిరసన
అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలోని జాకీ పరిశ్రమకు కేటాయించిన స్థలంలో తెలుగు యువత సభ్యులు నిరసన చేపట్టారు. వైకాపా ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలతో పరిశ్రమను రాప్తాడు నుంచి తరలించారని ఆరోపించారు.
telugu youth protest at anantapur dst about rapthadu jokey industry