అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులో ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏడు మద్యం బాటిళ్లును స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో కారులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 24 మద్యం బాటిళ్లతో పాటు 2 ఐచర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇండికా కారులో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 31 మద్యం బాటిళ్లను తీసుకున్నారు.
తెలంగాణ మద్యానికి రాష్ట్ర సరిహద్దుల్లోనే బ్రేక్ - illegal wine transport news in anantapur dst
తెలంగాణ రాష్ట్రం నుంచి విచ్చలవిడిగా మద్యం అక్రమరవాణా జరుగుతోంది. ఓ పక్క అధికారులు దొరికినకాడికి మద్యం సీసాలు సీజ్ చేస్తూ..నిందితులను అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. అయినా మద్యం అక్రమరవాణా ఆగటం లేదు. తాజాగా అనంతపురం జిల్లా గుత్తిలో చేసిన తనిఖీల్లో తెలంగాణ మద్యం బయటపడింది.
Telangana liquor seized in anantapur dst guthi
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం, ఇసుక అక్రమ రవాణాపై స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో సభ్యులను నియమించిందని అసిస్టెంట్ కమిషనర్ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో విజయ్ కుమార్ తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి