అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు నూతనంగా నిర్మించిన దేవాలయాలను.. తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆయన సతీమణితో కలిసి దర్శించారు.
గ్రామానికి చేరుకున్న వీరిని రఘువీరారెడ్డి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అక్కడి ఆలయాల విశిష్టతను వివరించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వారికి రఘువీరా శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు. అనంతరం దేవాలయ కట్టడాలపై భట్టి దంపతులకు రఘువీరా వివరించారు.