ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జలాశయంలో ఈతకు వెళ్లిన యువకుడు మృతి - అనంతపురం జిల్లా తాజా వార్తలు

పీఏబీఆర్​ జలాశయంలో ఈతకు వెళ్లిన కర్ణాటక యువకుడు మృతి చెందాడు. గజ ఈతగాళ్లు రెండు రోజులు పాటు గాలించి సునీల్​ మృతదేహాన్ని బయటకు తీశారు.

teenager died in pabr reservoi
పీఏబీఆర్​ జలాశయంలో యువకుడు మృతి

By

Published : Sep 26, 2020, 11:02 PM IST

జలాశయంలో ఈతకు వెళ్లి కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన యువకుడు మృతి చెందాడు. మరణించిన యువకుడు సునీల్​ (17)గా స్థానికులు గుర్తించారు. పీఏబీఆర్​ జలాశయం వద్దనున్న తన బంధువులు ఇంటికి వచ్చాడు. అనంతరం సరదాగా ఈతకు కొట్టేందుకు జలాశయం లోకి దిగాడు.

లోతు ఎక్కువ ఉండటంతో గల్లంతయ్యాడు. స్థానికులు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు రోజుల పాటు పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శనివారం మృతదేహం లభ్యమైంది. యువకుని మృతదేహం చూసి తల్లిదండ్రులు చేసిన రోదనలు స్థానికులను కలచివేశాయి.

ABOUT THE AUTHOR

...view details