Land Registrations stopped in AP: రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి భూముల విలువ పెంచేందుకు సిద్ధమవడంతో.. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రజలు బారులు తీరారు. చలానాలు పెంచడంతో తమపై అధిక భారం పడుతుందని భావించిన ప్రజలు ఉదయం నుంచే రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే వారికి కొత్త సమస్య ఎదురైంది.
రెండు రోజులుగా సర్వర్ పని చేయకపోవడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీంతో ఎక్కడికక్కడ దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేయకుండా అధికారులు పక్కన పెట్టారు. రిజిస్ట్రేషన్ల కోసం ఆఫీసుల వద్ద పడిగాపులు కాస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్ భూములకు ధరలు పెంచే విషయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన రిజిస్ట్రేషన్ సేవలు.. ప్రజల పడిగాపులు Lands Market Value : ఇలా అయితే సామాన్యులు ఆస్తులు కొనేదెలా..
నాలుగు రోజుల క్రితం చలానా కట్టినా.. సర్వర్ సమస్యతో రిజిస్ట్రేషన్ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ భూములకు ధరలు పెంచొద్దని.. నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.
కాగా సోమవారం కూడా ఇదే విధంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఉదయం నుంచి ప్రజలు కార్యాలయాల దగ్గర పడిగాపులు కాశారు. సర్వర్ సమస్యలతో.. సాయంత్రం ఆరు గంటల వరకూ ప్రజలు వేచి చూసినా.. రిజిస్ట్రేషన్ కాకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. చాలా మంది ముందుగానే చలానాలు తీసుకున్నామని చెబుతున్నారు. వివిధ సాంకేతిక సమస్యలతో.. రాష్ట్రంలో పలుచోట్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.
land rates in guntur " అమ్ముకోలేకపోతున్నాం..! మా భూముల ధరలు తగ్గించండి మహాప్రభో..! "
"భూముల రిజిస్ట్రేషన్‌కి సంబంధించి జూన్ 1వ తేదీ నుంచి రేట్లు అన్నీ పెంచారు. ఈ రోజు మేము రిజిస్ట్రేషన్‌కు వచ్చినా సర్వర్లు పనిచేయడం లేదని నిన్నటి నుంచి తిప్పిస్తున్నారు. చలానాలు కట్టడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాం. చలానాలు కట్టిన తరువాత కూడా రిజిస్ట్రేషన్లు కావడం లేదు. రేట్లు పెంపును వాయిదా వేయాలని కోరుతున్నాం". - రాఘవేంద్ర, అనంతపురం
"మేము ముందుగానే చలానా కట్టుకున్నాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అంటే.. రెండు రోజుల నుంచి సర్వర్ పని చేయడం లేదని చెప్తున్నారు. చలానా కట్టి నాలుగు రోజులు అయింది. ఆఫీసు దగ్గర పడిగాపులు కాస్తున్నాం. సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది". - నాగార్జున, అనంతపురం
"నిన్న 12 గంటల నుంచి సర్వర్ డౌన్ అయిపోయింది. రాష్ట్రం మొత్తం నిలిచిపోయాయి. ప్రజలంతా సాయంత్రం వరకూ వేచి ఉన్నారు. కానీ సర్వర్ పని చేయకపోవడంతో నిరాశ చెంది.. ఇళ్లకి వెళ్లిపోయారు. ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు.. మార్కెట్ రేటు పెంచమని చెప్పారు. 1వ తేదీ నుంచి పెంచాలి అని అన్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే.. మేము వాటిని అమలు చేస్తాము". - సత్యనారాయణ మూర్తి, సబ్ రిజిస్ట్రార్