అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతులు నిర్వహించడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామంతో పిల్లలకు కరోనా సోకుతుందేమోనని.. వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదేమని ఉపాధ్యాయులను ప్రశ్నిస్తే.. పిల్లలకు సందేహాలు ఉన్నందున తక్కువ మంది విద్యార్థులకు పాఠాలు చెబుతున్నామని అంటున్నారని వాపోయారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి.. కొంతకాలం వరకు తరగతులను వాయిదా వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
కరోనా వ్యాప్తి సమయంలో తరగతులు.. ఆందోళనలో తల్లిదండ్రులు
రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతమవుతోంది. అప్రమత్తమైన అధికారులు కొన్ని పరీక్షలను రద్దు చేసి.. విద్యా సంవత్సరాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. విద్యార్థులందరూ ఇళ్లలోనే ఉండి చదువుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా అనంతపురం జిల్లా బండ్లపల్లి ఉన్నత పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా తమ పిల్లలకు వైరస్ సోకుతుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వ్యాప్తి సమయంలో తరగతులు.. ఆందోళనలో తల్లిదండ్రులు