Student Suicide: అనంతపురంలో రామన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి మృతి కలకలం రేపింది. 8వ తరగతి చదువుతున్న హరికృష్ణను పాఠశాలలో ఉపాధ్యాయులు కొట్టడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. అనంతపురంలోని పాఠశాల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలను వెంటనే సీజ్ చేసి, విద్యార్థి మృతికి కారణమైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి ఆత్మహత్య.. ఉపాధ్యాయులు కొట్టడం వల్లేనని ఆరోపణ - మనస్థాపంతో విద్యార్థి ఆత్మహత్య
Student Suicide: అనంతపురంలో ఎనిమిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
student
హరికృష్ణను ఉపాధ్యాయులు ఏదో కారణం చేత కొట్టేవారని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. మనస్థాపానికి గురైన విద్యార్థి కూడేరు మండలం ముద్దలాపురంలోని ఇంట్లో గురువారం మధ్యాహ్నం ఉరి వేసుకున్నాడన్నారు. విద్యార్థి సంఘాల డిమాండ్‌తో పాఠశాలను సీజ్ చేసి,.. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి