అనంతపురం జిల్లా బీచ్గాని పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల పట్ల ఆంగ్లం బోధించే ఉపాధ్యాయుడు అమానుషంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ...విద్యార్థుల తల్లిందండ్రులు నిరసన చేపట్టారు. అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలని కోరుతూ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. విద్యాబుద్ధులు నేర్పాల్సింది పోయి, తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. తమకు పాఠశాలకు రావాలంటేనే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీచక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి లక్ష్మీదేవి పాఠశాలను సందర్శించి ఘటనపై ఆరా తీశారు. ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
విద్య నేర్పాల్సిందిపోయి...వికృత చేష్టలు ! - teacher Unruly antics
విద్యార్థులకు పాఠాలు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు...నీతి తప్పాడు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సింది పోయి...వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. కీచక పర్వానికి తెరలేపి విద్యార్థులను కీలుబొమ్మలుగా చేసి ఆడుకుంటున్నాడు. తన మనవరాలి వయసున్న విద్యార్థులను అసభ్యంగా తాకుతూ...అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ అమానవీయ ఘటన అనంతపురం జిల్లా బీచ్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది.
విద్య నేర్పాల్సింది పోయి.. వికృత చేష్టలు