ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెలుగు వీర లేవరా.. కరోనాను తరుమురా.. దేశాన్ని కాపాడరా' - గుంతకల్లులో కరోనా నివారణకు ప్రచారం

కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా ఉండేందుకు గుంతకల్లులో ఉపాధ్యాయ సంఘల నేతలు ప్రజలకు అవగాహన కలిపించారు. తెలుగు వీర లేవరా..కరోనాను తరుమురా..దేశాన్ని కాపాడురా...అంటూ రోడ్లపై ప్రకార్డులుతో ర్యాలీ చెపట్టారు.

Teacher union leaders campaign for corona prevention
కరోనా నివారణకు ఉపాధ్యాయ సంఘల నేతలు ప్రచారం

By

Published : Jul 20, 2020, 8:01 PM IST

తెలుగు వీర లేవరా.. కరోనాను తరుమురా.. దేశాన్ని కాపాడురా.. అంటూ అనంతపురం జిల్లా గుంతకల్లులో ఉపాధ్యాయ సంఘాల నేతలు రోడ్లపై ప్లకార్డులుతో ర్యాలీ చేపట్టారు. పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుంచి గాం ధీచౌక్, కసాపురం కూడలి పాత బస్టాండ్ మీదుగా ర్యాలీ సాగించారు. రోడ్లపైకి రాకండి.. రోగాన్ని కొని తెచ్చుకోకండి అంటూ ప్రచారం చేశారు.

కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా.. ప్రజలకు అవగాహన కల్పించేందుకే తమ కర్తవ్యంగా ఈ ర్యాలీ చేపట్టామన్నారు. కొవిడ్ నిబంధనాలు ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. అంతా భౌతిక దూరం పాటించాలని.. అత్యవసర సమయాల్లోనే మాస్కుతో బయటకు రావాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details