నాలుగు నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవటంతో ఒప్పంద ఉపాధ్యాయుడు వారాంతపు సంతలో కూరగాయలు అమ్ముతున్నాడు. అనంతపురం జిల్లా నూతిమడుగు ప్రభుత్వ గురుకుల పాఠశాలలో మురళీ మోహన్ ఒప్పంద ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం తమకు నాలుగు నెలలుగా వేతనాలు నిలిపివేసిందని ఉపాధ్యాయుడు వాపోతున్నాడు. విధిలేని పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోవటానికి సంతలో కూరగాయలు అమ్ముతున్నట్లు తెలిపారు.
వేతనాల్లేక కూరగాయలు అమ్ముతున్న ఒప్పంద ఉపాధ్యాయుడు - teacher selling vegetables in anantapur
బడిలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఓ ఒప్పంద ఉపాధ్యాయుడు..వారాంతపు సంతలో కూరగాయలు విక్రయిస్తున్నాడు. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం వేతనాలు నిలిపివేయటంతో తన కుటుంబాన్ని పోషించుకోవటానికి ఇంతకన్నా గత్యంతరం లేకుండా పోయిందని వాపోతున్నాడు. రైతుల వద్ద కూరగాయలు కొనుగోలు చేసి వారాంతపు సంతల్లో విక్రయిస్తున్నానని... వచ్చిన నాలుగు రాళ్లతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాని అన్నాడు. ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు విడుదల చేయాలని కోరుతున్నాడు.
![వేతనాల్లేక కూరగాయలు అమ్ముతున్న ఒప్పంద ఉపాధ్యాయుడు వేతనాల్లేక కూరగాయలు అమ్ముతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు !](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7725600-270-7725600-1592834765422.jpg)
వేతనాల్లేక కూరగాయలు అమ్ముతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు !
తనకు వేరే ఉపాధి మార్గం లేదని.. తన తల్లిదండ్రులను పోషించుకోవటానికి ఇంతకన్నా గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రైతుల వద్ద కూరగాయలు కొనుగోలు చేసి వారాంతపు సంతలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమ పరిస్థితిని గమనించి వేతనాలు మంజూరు చేయాలని కోరుతున్నారు.
Last Updated : Jun 22, 2020, 10:12 PM IST
TAGGED:
teacher selling vegetables