108 వాహనాలకు సంబంధించిన అక్రమాలపై విచారణ జరిపించాలని తెలుగు యువత నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురంలో అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు వినతిపత్రం అందజేసి నిరసన చేపట్టారు. వైకాపా ప్రభుత్వం 108 వాహనాల నిర్వహణ విషయంలో అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.
అనంతపురంలో తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన - తెలుగు యువత తాజా వార్తలు
108 వాహనాలకు సంబంధించిన అక్రమాలపై విచారణ జరిపించాలని అనంతపురం తెలుగు యువత నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
tdp youth wing protest in anantapur
ప్రభుత్వ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతోందని మండిపడ్డారు. మద్యం, విద్యుత్ బిల్లులు పెంచి.. ఇప్పుడు వాహన విక్రయాల విషయంలో అధిక ధరలు చూపిస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.