ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మద్యం దుకాణాలను సత్వరమే మూసేయాలి' - అనంతపురం జిల్లా, కదిరి, గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయాల

మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా తెలుగుదేశం మహిళా విభాగం నేతలు రిలే దీక్షలు చేపట్టారు. గుంతకల్లు, కదిరి తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు.

ananthapuram district
మందుల షాపుకు లేని న్యాయం..మందు షాపులకెందుకు

By

Published : May 9, 2020, 1:11 PM IST

అనంతపురం జిల్లా కదిరి, గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట, తెదేపా మహిళానేతలు నిరసన చేశారు. కొందరు ఇళ్లలోనే భౌతిక దూరం పాటిస్తూ దీక్ష చేపట్టారు. సామాన్యులు మెడికల్ షాపులకు వెళితే పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారని.. మద్యం కోసం అయితే క్యూలు కట్టిస్తున్నారని దుయ్యబట్టారు.

మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేశారు. గుంతకల్లు తహసీల్దార్ డీటీ మునివేలుకు వినతి పత్రం అందించారు. కదిరిలోనూ ఆందోళన చేసిన తెలుగు మహిళలు తహసీల్దార్ ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details