రాష్ట్రంలో జరగబోయే నగరపాలక, పురపాలక సంఘాల్లో.. తెదేపా ఘన విజయం సాధిస్తుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 15 వార్డులో తెదేపా అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రాయదుర్గం పట్టణ అభివృద్ధి జరగాలంటే.. తెదేపాను గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో నగరాలు, పట్టణాల్లో ఎలాంటి అభివృద్ధి లేదని ఆయన విమర్శించారు.