ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మహిళ హోంమంత్రిగా ఉన్నా.. రాష్ట్రంలో వారికే రక్షణ లేదు' - ధర్మవరంలో స్నేహలత హత్యపై తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం ఎస్​ రాజు

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోతోందని తెదేపా ఏపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్​ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ఒకటవ పట్టణ సీఐ ప్రతాప్​రెడ్డి నిర్లక్ష్య వల్లే.. ధర్మవరంలో స్నేహలత అనే యువతి హత్యకు గురైందని ఎస్సీ సంఘం నేతలు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని.. సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

sc associations agitation
ధర్మవరం యువతి హత్య ఘటనపై ఎస్సీ సంఘాల ఆందోళన

By

Published : Dec 23, 2020, 9:39 PM IST

ఏపీలో మహిళలకు రక్షణ లేకుండాపోతోందని తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్​ రాజు అన్నారు. ధర్మవరం మండలం బడన్నపల్లిలో హత్యకు గురైన స్నేహలత మృతదేహాన్ని పరిశీలించి.. ఆమె తండ్రి కుల్లాయప్పను పరామర్శించారు. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో.. వారికే రక్షణ లేకపోవడం దారుణమన్నారు. నిందితులను వెంటనే శిక్షించకపోతే కలెక్టరేట్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

యువతి అదృశ్యం కేసులో అనంతపురం ఒకటవ పట్టణ సీఐ ప్రతాప్​రెడ్డి నిర్లక్ష్యం వహించారని.. ఎస్సీ సంఘం నాయకులు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు సరిగా పట్టించుకోకపోవడం వల్లే.. ధర్మవరంలో స్నేహలత హత్యకు గురైందని ఆరోపించారు. గతంలోనూ అనేక సందర్భాల్లో.. సీఐ ఇదేవిధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని.. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details