అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని రెండువేల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా నేత ఉమామహేశ్వరనాయుడు డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో 28 రంగాలకు చెందిన వివిధ రకాల కార్మికుల కుటుంబాలు ఉపాధి లేక అల్లాడుతున్నాయని తెలిపారు. వీరిని ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు సహాయం అందించి ఆర్థికంగా ఆదుకుంటూ ఉపాధి కల్పించాలని కోరారు.
'లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలి' - అనంతపురంలో కరోనా కేసులు
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో లాక్‌డౌన్ తో ఉపాధి కోల్పోయిన ప్రజలందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా నేత ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు.
!['లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలి' tdp protest on ysrcp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7221528-623-7221528-1589629520057.jpg)
tdp protest on ysrcp