అనంతపురం జిల్లా హిందూపురంలో తెదేపా నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్లో ఉన్న గృహనిర్మాణ బిల్లులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు పట్టాలు ఇచ్చి లబ్ధిదారులకు ఆర్ధిక చేయూతనందిస్తే.. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పెండింగ్ బిల్లులను మంజూరు చేయకుండా పేదల సొంతింటి కలను కలగానే మిగుల్చుతుందని విమర్శించారు. వెంటనే బిల్లులు మంజూరు చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
హిందూపురంలో తెదేపా నాయకుల నిరసన - ఆనంతపురం తాజా వార్తలు
పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా హిందూపురం తెదేపా ఆధ్వరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బిల్లులను మంజూరు చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
హిందూపురంలో తెదేపా నాయకుల నిరసన