ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెదేపా శ్రేణుల నిరసన - tdp leaders protest in gudibanda news

అనంతపురం జిల్లా గుడిబండ మండలంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద తెదేపా నాయకులు నిరసన చేశారు. 'నాఇల్లు నా సొంతం నాఇంటి స్థలం నాకు ఇవ్వాలి' అనే కార్యక్రమంలో భాగంగా ఈ ఆందోళన నిర్వహించారు.

tdp protest
ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న తెదేపా నాయకులు

By

Published : Nov 8, 2020, 8:25 AM IST

అనంతపురం జిల్లా గుడిబండ మండల కేంద్రంలో 'నాఇల్లు నా సొంతం నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి' అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తెదేపా నాయకులు, కార్యకర్తలు తహసీల్దార్​ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్ల పంపిణీ తక్షణమే చేపట్టాలని డిమాండ్​ చేశారు. పట్టణాల్లో ఒకటిన్నర సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పెండింగ్​లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు ఎమ్మార్వోకు వినతిపత్రం అందించారు.

ABOUT THE AUTHOR

...view details