అనంతపురం జిల్లాలో..
మడకశిర పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో తేదేపా ఎమ్మెల్సీ తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న, తెదేపా నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకాపా ప్రభుత్వానికి భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని దండం పెట్టి నిరసన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటినుంచి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రత్యేకించి హిందూ దేవాలయాలు, వాటి ఆస్తుల పరిరక్షణ విషయంలో హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారని వాపోయారు. అంతర్వేది ఘటన మరువక ముందే ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారి రథంలో సింహాలు మాయమవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని దేవాలయాలను సంరక్షించాలని కోరారు.
కల్యాణదుర్గంఎన్టీఆర్ భవన్ నుంచి తెదేపా నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి.. అయ్యప్ప ఆలయం ముందు నిరసన చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో గూండాల పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో మూడు సింహాలు మాయంపై తెదేపా నేత ఉమామహేశ్వర నాయుడు మండిపడ్డారు.