వైకాపా ప్రభుత్వం జర్నలిస్టులపై చేస్తున్న అనైతిక దాడులను వెంటనే ఆపాలని తెదేపా డిమాండ్ చేసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెదేపా నేతలు పార్టీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెదేపా నేత ఉమామహేశ్వర నాయుడు ఆరోపించారు.
జర్నలిస్టులపై దాడులు ఆపాలి - tdp on ysrcp government
వైకాపా ప్రభుత్వం జర్నలిస్టులపై దాడులను ఆపాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిరసన చేపట్టారు. తెదేపా కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.
![జర్నలిస్టులపై దాడులు ఆపాలి tdp protest at kalyana durgam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7500670-544-7500670-1591441086374.jpg)
కళ్యాణదుర్గంలో తెదేపా నిరసన