అనంతపురంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద తెదేపా నేతలు ఆందోళన చేశారు. తాగునీటి కొరత, ఇంటి పన్ను, ఆస్తి పన్నుల పెంపును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. పన్ను పెంపు పేరుతో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అండగా తెదేపా ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
'వైకాపా ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరుస్తోంది' - అనంతపురంలో తెదేపా ధర్నా తాజా వార్తలు
వైకాపా ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల పై భారం మోపుతోందని తేదేపా నాయకులు ఆరోపించారు. అనంతపురంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద తాగునీటి కొరత, ఇంటి పన్ను, ఆస్తి పన్నుల పెంపును నిరసిస్తూ తెదేపా నాయకులు ధర్నా చేపట్టారు
అనంతపురంలో తెదేపా ధర్నా