విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా తెదేపా నిరసన - , కరెంట్ బిల్లు కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉరవకొండలో
పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని అనంతపురం జిల్లా ఉరవకొండలో తెదేపా నిరసన చేపట్టింది. రెండు నెలలుగా ఉపాధి లేక తిండికి కష్టపడుతున్న నిరుపేదలు.. వేలల్లో బిల్లులు ఎలా కడతారు అని తెదేపా నేతలు ప్రశ్నించారు.
Tdp protest against current bills at urava konda
అనంతపురం జిల్లా ఉరవకొండలో అధిక విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా తెదేపా నిరసన చేపట్టింది. లాక్ డౌన్ కారణంగా పేదలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో విద్యుత్ చార్జీలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.