ప్రభుత్వ పథకాలన్నింటికీ జగన్ పేరు పెట్టడమేంటని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనంతపురం పర్యటనలో అన్నారు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు.. కేవలం విధ్వంసం మాత్రమే నడుస్తోందని విమర్శించారు. ఎయిడెడ్ కళాశాల భూములపై సీఎం జగన్ కన్నేశారని ఆరోపించారు. ఎయిడెడ్ కళాశాల నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు వచ్చారని నారా లోకేశ్ వివరించారు. 2 వేలకు పైగా ఎయిడెడ్ పాఠశాలల్లో 2 లక్షల మంది, 182 జూనియర్ కళాశాలల్లో 71 వేల మంది విద్యార్థులున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎయిడెడ్ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై విద్యార్థుల ఆగ్రహం
అందరికీ ఉచిత విద్య అంటూ సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏమైందని ముఖ్యమంత్రిని.. విద్యార్థులు నిలదీశారు. లోకేశ్‌తో ముఖాముఖి సందర్భంగా మాట్లాడిన విద్యార్థులు..విద్యను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రైవేటుపరం చేస్తే వేలకు వేలు ఫీజులు ఎలా కట్టాలని ప్రశ్నించారు.
దాడి చేసినవారిని శిక్షించాలి: రామకృష్ణ